కామ్రేడ్ గా విజయ్ దేవరకొండ
- August 09, 2018
అర్జున్ రెడ్డి ద్వారా తెలుగు ప్రేక్షకులను సంపిదించుకున్న విజయ్ దేవరకొండ.. తన యాటిట్యూడ్ తో యువతను ఆకట్టుకున్నాడు.. ఆ చిత్రం లో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా చక్కగా నటించిన విజయ్ ఆ తరువాత 'మహానటి లో కీలక పాత్రతో' మరింత చేరువయ్యాడు.. ప్రస్తుతం 'గీతా గోవిందం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్న ఈ నటుడు… తన తరువాత చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు.. ఈ చిత్రానికి భరత్ కమ్మా దర్శకత్వం వహిస్తున్నాడు.. కాగా ఈ చిత్రం కాకినాడ నేపథ్యంలో కొనసాగుతుంది…
కాకినాడ నేపద్యంలో సాగుతున్న ఈ చిత్రం దాదాపుగా ఈ సినిమా షూటింగ్ అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే జరగనుంది. ఈ చిత్రంలో విజయ్ సరసన రస్మిక మందాన నటిస్తోంది. ఇందులొ ఈమె ఓ క్రికెటర్ గా కనిపించనుందట.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని 'తొండంగి'లో షూటింగు జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
ఇప్పటివరకూ తెలంగాణ యాసతో యూత్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడనుండటం విశేషం.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







