మనామా:లిక్కర్ స్మగ్లర్స్ అప్పీల్‌ని తిరస్కరించిన న్యాయస్థానం
- August 10, 2018
మనామా:200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన ఆల్కహాల్‌ని స్మగ్లింగ్ చేసిన కేసులో 14 మందికి జైలు శిక్ష విధించగా, వారి అప్పీల్‌ని న్యాయస్థానం తాజాగా తిరస్కరించింది. నిందితులంతా ఆసియా జాతీయులే. వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ కేసుకి సంబంధించి మొత్తం 21 మంది అనుమానితులపై కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురికి మూడు నెలల జైలు శిక్ష పడగా, వీరెవరూ తమ శిక్షను అప్పీల్ చేయడానికి ముందుకు రాలేదు. షిప్లో అక్రమంగా మద్యం బాటిళ్ళను దాచి, బహ్రెయిన్‌లోకి స్మగుల్ చేస్తుండగా నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యంతోపాటుగా, 36,000 బహ్రెయినీ దినార్స్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







