వణికిపోతున్న కర్నాటక..

- August 11, 2018 , by Maagulf
వణికిపోతున్న కర్నాటక..

వర్ష బీభత్సానికి కర్నాటక వణుకుతోంది. కోస్తా, దక్షిణ కర్నాటక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో.. ఊర్లు, ఏరులు ఏకమయ్యాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్‌మంగళూరు, కొడుగు, షిమొగ జిల్లాల్లో అతిభారీవర్షాలకు జన జీవనం అస్తవ్యస్థమైంది. వరదలు తగ్గుముఖం పట్టేవరకూ స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి లేదు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అదనపు సహాయ బృందాల్ని ఆయా జిల్లాలకు పంపించారు. చాలా ప్రాంతాల్లో వరద ఉధృతి కారణంగా రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలలు, వర్షంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com