వణికిపోతున్న కర్నాటక..
- August 11, 2018
వర్ష బీభత్సానికి కర్నాటక వణుకుతోంది. కోస్తా, దక్షిణ కర్నాటక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో.. ఊర్లు, ఏరులు ఏకమయ్యాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. దక్షిణ కన్నడ, ఉడుపి, చిక్మంగళూరు, కొడుగు, షిమొగ జిల్లాల్లో అతిభారీవర్షాలకు జన జీవనం అస్తవ్యస్థమైంది. వరదలు తగ్గుముఖం పట్టేవరకూ స్కూళ్లు తెరుచుకునే పరిస్థితి లేదు. మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో.. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. అదనపు సహాయ బృందాల్ని ఆయా జిల్లాలకు పంపించారు. చాలా ప్రాంతాల్లో వరద ఉధృతి కారణంగా రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. తీర ప్రాంతంలో బలమైన ఈదురు గాలలు, వర్షంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







