మైక్రోసాఫ్ట్‌లో మరో రికార్డ్ సృష్టించిన సత్యనాదెళ్ల
- August 11, 2018
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన సొంత సంస్థలో మరో రికార్డు సృష్టించారు. మైక్రోసాఫ్ట్‌లో తనకున్న కామన్ షేర్లలో దాదాపు 30 శాతం షేర్లను ఈ భారత సంతతి సీఈవో అమ్మేశారు. ఈ షేర్ల అమ్మకాల ద్వారా రూ.248 కోట్ల (35.9 మిలియన్ డాలర్లు) ఆదాయం వచ్చింది.
స్టాక్ మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్ షేర్లు గరిష్ఠ స్థాయిన ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో 109.08 డాలర్లు-109.68 డాలర్లు ధరల శేణ్రిలో మొత్తం 3,28,000 షేర్లను నాదెళ్ల అమ్మేశారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి నాదెళ్ల స్టాక్స్‌ను అమ్మడం ఇది రెండోసారి. రెండేండ్ల క్రితం 2016లో 8.3 మిలియన్ డాలర్ల విలువైన 1,43,000 షేర్లను అమ్మేశారు. నాడు ఒక్కో షేర్ విలువ 58 డాలర్లుగానే ఉండగా ప్రస్తుతం అది రెట్టింపు అయింది.
అమెరికా స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీకి మైక్రోసాఫ్ట్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ అమ్మకాల నుంచి నాదెళ్లకు 35.9 మిలియన్ డాలర్ల సొమ్ము వచ్చింది. గడిచిన ఏడాది కాలంలో మైక్రోసాఫ్ట్ షేర్ల విలువ 53 శాతం పుంజుకున్నది. ప్రస్తుతం షేర్ విలువ 109 డాలర్లుగా ఉంది. గత నెల 25న రికార్డు స్థాయిలో 110.83 డాలర్లను తాకింది. నాదెళ్లకు ఇంకా కంపెనీలో 7,78,596 కామన్ షేర్లున్నాయి. ఈ పరిణామం గురించి మైక్రోసాఫ్ట్ స్పందించింది. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో భాగంగానే నాదెళ్ల స్టాక్స్‌ను అమ్మేశారని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. సంస్థలోవాటాను తగ్గించుకునే ఉద్దేశం ఏమీ నాదెళ్లకు లేదన్నారు.
నిజానికి సంస్థలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్దేశించిన పరిమాణం కంటే చాలా ఎక్కువ షేర్లనే నాదెళ్ల కలిగి ఉన్నారని సీఎన్‌బీసీకి చెప్పారు. గతేడాది నాదెళ్ల వార్షిక మూల వేతనం 1.45 మిలియన్ డాలర్లుగా ఉన్నది. షేర్లు, ఇతరత్రా చెల్లింపులతో మొత్తం అందుకున్నది 20 మిలియన్ డాలర్లపైనే. మైక్రోసాఫ్ట్ నిబంధనల ప్రకారం తన మూల వేతనంతో పోల్చితే 15 రెట్లు అధికంగా విలువైన షేర్లను సంస్థలో నాదెళ్ల కలిగి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇంతకంటే ఎక్కువ షేర్లే ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో నాదెళ్లకున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







