అఫీషియల్ - ఆర్ఎక్స్ 100 రీమేక్..ఆది కి జంట ఎవరో!
- August 12, 2018
తెలుగు చిత్ర సీమలో సంచలన విజయం సాధించిన "ఆర్ఎక్స్ 100" సినిమా తమిళంలోకి రీమేక్ అవుతోంది. ఈ సినిమాలో హీరోగా ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. అంతేకాదు ఈ సినిమాలో ఆది ఫస్ట్ లుక్ ఫోటో కూడా విడుదలయ్యింది. ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థ 'ఆరా సినిమాస్' ఈ సినిమాను తమిళంలో నిర్మిస్తోంది.
అయితే ఈ "ఆర్ఎక్స్ 100"లో హీరో ఎవరన్న దాని కంటే హీరోయిన్ ఎవరు? అన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే నెగటివ్ రోల్ మాత్రమే కాకుండా, హాట్ హాట్ సన్నివేశాలు ఉండడంతో, ఈ రోల్ ను అంగీకరించే తమిళ హీరోయిన్ ఎవరన్నది కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేరంటే మళ్ళీ రాజ్ పుత్ కే ఆ అవకాశం దక్కుతుందేమో!?
ఇదిలా ఉంటే, తెలుగులో 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆది, ఈ నెలలోనే "నీవెవరో" సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓ తమిళ సినిమాను తెలుగులో 'నీవెవరో' పేరుతో రీమేక్ చేస్తోన్న ఆది, ఇపుడు 'ఆర్ఎక్స్ 100' తెలుగు మూవీని తమిళ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







