"ఆయుష్మాన్ భారత్" పేరిట పెద్ద ఆన్లైన్ ఫ్రాడ్.. జాగ్రత్తగా ఉండండి!
- August 15, 2018
నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి ప్రసంగిస్తూ ఆయుష్మాన్ భారత్ పేరిట దేశంలో ఉన్న అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించబోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి సెప్టెంబర్ 25న భారతీయ జనసంఘ్ అధ్యక్షుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జయంతి సందర్భంగా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ మొదలవుతుంది. అయితే అమాయకులను మోసం చేయడానికి ఇప్పటికే అనేక నకిలీ వెబ్ సైటు పుట్టుకొచ్చాయి. ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ అయిన https://www.abnhpm.gov.in/ ని పోలి ఉండేలా ఈ నకిలీ వెబ్ సైట్లు డిజైనింగ్ తో సహా రూపొందించబడడం గమనించాలి. ఆయా నకిలీ వెబ్సైట్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫోటోలు పెట్టడంతో పాటు.. 1000 నుండి 2000 రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు అంటూ జనాలను మోసం చేసే మెసేజ్ పొందుపరచబడింది.
అంతేకాదు, "పేదలకు చేరేలా ఈ మెసేజ్ అందరికి షేర్ చేయమని" వినియోగదారులను ఈ నకిలీ వెబ్ సైట్ ట్రాప్ చేస్తున్నాయి. తెలిసి తెలియక చాలామంది అమాయకులు వారు కోరిన మొత్తాన్ని చెల్లించి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. Whatsappలో కూడా ఆయుష్మాన్ భారత్ పేరిట నకిలీ వెబ్ సైట్లు విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి. ఒకవేళ ఏదైనా మీ నోటీసుకు వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకండి, ఇతరులకు షేర్ చేయకండి. సెప్టెంబరు 15 నుండి మాత్రమే, అదికూడా పైన పేర్కొనబడిన అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఒక పైసా అదనంగా చెల్లించాల్సిన పనిలేదు అని, ఒకవేళ ఏదైనా వెబ్సైట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్లయితే, దాన్ని కచ్చితంగా నకిలీ వెబ్ సైట్ గా ప్రజల పరిగణించాలని, అలాగే కొన్ని సైట్లు డబ్బులు ఏమీ అడగకుండానే ప్రజల నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని ఆయుష్మాన్ భారత్ సీఈవో ఇందు భూషణ్ వెల్లడించారు. అలాగే ఈ స్కీమ్ కు సంబంధించి కేవలం ఒకే ఒక గవర్నమెంట్ హెల్ప్‌లైన్ నెంబర్ ఉందనీ, అది 1455 అనీ, ఇతర నెంబర్లను కూడా నమ్మొద్దని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







