ఫేర్స్‌ని రెగ్యులేట్ చెయ్యాలి: ట్యాక్సీ డ్రైవర్స్
- December 15, 2015
‘
మవసలాత్ కొత్త బస్సుల్ని తీసుకురావడంతో తమ జీవనోపాధికి గండి పడిందని ఆరోపిస్తూ ట్యాక్సీ డ్రైవర్లు తమ ఉపాధి మార్గాలను దెబ్బ కొట్టవద్దంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మవసలాత్ బస్సుల రాకతో, ట్యాక్సీల్లో ప్రయాణించేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ట్రయల్ పీరియడ్‌లో పూర్తిగా ఈ బస్సులు ఉచితంగానే ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నాయి. ఇది ట్యాక్సీ డ్రైవర్లకు జీవనోపాధి కరువు చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల తరఫున నాయకుడిగా ఎంపికైన ఆరుగురిలో ఒకరైన సులేమాన్ అల్ జర్దానీ మాట్లాడుతూ, మవసలాత్ బస్సులతో ఆర్థికంగా నష్టపోయామనీ, కార్ల కోసం తీసుకున్న లోన్ల ఇన్‌స్టాల్‌మెంట్ కూడా చెల్లించలేకపోతున్నట్లు చెప్పారు. టిక్కెట్ ధరల రెగ్యులేషన్ ఒక్కటే సమస్యకు పరిష్కారమని వారు అంటుండగా, ట్యాక్సీల కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, ఆ ప్రమాదాలకు వారు బాధ్యత తీసుకోవడంలేదని, అందుకే ప్రయాణీకులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వైపు దృష్టి సారించారని అధికారులు చెప్పారు. ట్యాక్సీలకు పార్కింగ్ రుసుము తక్కువగా ఉందనీ, మినీ బస్సులకు ఎక్కువగా ఉందని, ఇంతకన్నా ఏమీ చేయలేమని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వమే ప్రైవేటు వాహనాల్ని ప్రైవేటు సంస్థలు అద్దెకు తీసుకునేలా అనుమతిస్తే సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుందని యాక్సిస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ నితిన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







