కొచ్చి ఎయిర్పోర్ట్ లో సేవలు పునప్రారంభం
- August 19, 2018
తిరువనంతపురం : కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుండి విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. నావికాదళ ఎయిర్‌స్టేషన్‌లో విమాన కార్యకలాపాలను కేంద్రం, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఉమ్మడి బృందం నిర్ణయించిందని కమాండర్ శ్రీధర్ వారియర్ వెల్లడించారు. నావికా ఎయిర్‌స్టేషన్ వద్ద మొట్టమొదటి విమానం ఐఎన్ఎస్ గరుడా విమానం ల్యాండ్ అయింది. బెంగుళూరు నుండి 70 సీట్లతో కూడిన ఎయిర్ఇండియా అనుబంధ సంస్థకు చెందిన ఎలైన్స్ ఎయిర్ విమానం కొచ్చిలో ల్యాండ్ అయినట్లు తెలిపారు. మధురై, కోయంబత్తూర్ల నుండి త్వరలో సేవలను ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. విమానం గతంలో విమానాశ్రయం కూడా నీటిలో మునిగిపోవడంతో ఆగస్ట్ 26 వరకు కార్యక్రమాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. వర్షపాతం గత మూడు రోజుల నుండి క్రమంగా తగ్గుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. శిబిరాలలో ఉన్నవారికి ఆహారంతో పాటు మందులను అందించేందుకు సహాయక బృందాలు సమాయత్తమౌతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









