తాలిబన్ల నిర్బంధంలో 100మంది ప్రయాణికులు
- August 20, 2018
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రాంతంలో 100మందిని తాలిబన్లు నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు. వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈద్ అల్ అదా రోజున తాలిబన్లతో కాల్పుల విరమణ కోసం అధ్యక్షుడు అష్రఫ్ ఘానీ పిలుపున్విడాన్ని వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఈ ఘాతుకానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఖుండాజ్ ప్రాంతానికి చెందిన కౌన్సిల్ అధికారి మొహమ్మద్ యుసుఫ్ ఆయుబి మాట్లాడుతూ సోమవారం ఖాన్ అబాడ్ జిల్లాలోని మూడు బస్సులను ఆపి అందులోని ప్రయాణికులను అపహరించినట్లు తెలిపారు. టాక్తార్ ప్రాంతానికి చెందిన వారు కాబూల్‌కు వెళ్లేందుకు ఆబస్సులలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. అయితే దీనిపై తాలిబన్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే ఆప్రాంతమంతా తాలిబన్ల నియంత్రణలోనే ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







