సెకనుకు 70 మెగాబిట్ వేగంతో డౌన్లోడ్..
- December 15, 2015-70 ఎంబీపీఎస్ 4జీ సేవలపై క్రెడిట్ స్యూస్సే నిపుణుల ఆశ్చర్యం ముంబై, డిసెంబర్ 15: కాలంతోపాటే ఇంటర్నెట్ సేవల రంగంలో కూడా ఊహించని విధంగా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సెకనుకు 70 మెగాబిట్ (ఎంబీపీఎస్) వేగంతో ఒక సినిమాను దాదాపు అర నిమిషంలోపే డౌన్లోడ్ చేసే ఫోర్త్ జనరేషన్ (4జీ) సేవలు ముంబై వినియోగదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ముంబై నెటిజన్ల కోసం 4జీ సేవలను ప్రయోగాత్మకంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అందుబాటులోకి తెచ్చింది. ముంబైలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 4జీ సేవలపై ప్రముఖ రేటింగ్ సంస్థ క్రెడిట్ స్యూసే నిపుణులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఫ్రీ ట్రయల్‌లో 70 ఎంబీపీస్ స్పీడ్ డౌన్లోడ్ అనుభవాన్ని ప్రత్యక్షంగా చూశామని క్రిడిట్ స్యూస్సే ప్రతినిధి పేర్కొన్నారు. 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఓ సినిమాను మూడు నిమిషాల్లోనే డౌన్లోడ్ చేయొచ్చని, ఇక 70 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డౌన్లోడ్ చేస్తే అర నిమిషం సరిపోతుందన్నారు. భారతీ ఎయిర్టెల్ అందిస్తున్న 4జీ స్పీడ్‌తో పోల్చితే రిలయన్స్ జియో స్పీడ్ ఎక్కువని క్రెడిట్ స్యూస్సే పేర్కొన్నది. దాదాపు 95 వేల కోట్ల వ్యయంతో భారత్‌లో 4జీ సేవలను ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







