'విశ్వాసం' ఫస్ట్ లుక్ రిలీజ్
- August 22, 2018
తల అజిత్ మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వాసం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో 'వి' అక్షరంతో తెరకెక్కిన అజిత్ సినిమాలు వాలి .. విలన్ .. వీరం .. వేదాళం , వివేగం చిత్రాలు అజిత్ కి సూపర్ సక్సెస్ ను ఇవ్వడంతో తన తాజా చిత్రానికి కూడా మొదట లెటర్ వి ఉండేలా చూసుకున్నాడు అజిత్. విశ్వాసం అనే టైటిల్‌తో అజిత్ తాజా చిత్రం తెరకెక్కుతుండగా, ఈ రోజు మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కోరమీసంతో రెండు గెటప్స్ లో విజయ్ లుక్ అదిరింది. పోస్టర్ని బట్టి చూస్తుంటే చిత్రంలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అనే డౌట్ అభిమానలులో కలుగుతుంది. ఈ చిత్రాన్ని వీరం, వేదాళం, వివేగం సినిమాల దర్శకుడు శివనే విశ్వాసం సినిమాని కూడా తెరకెక్కిస్తున్నాడు.
విశ్వాసం చిత్రంలో అజిత్ ఓ డాన్‌గా కనిపించనుండగా, తొలిసారి ఈ సినిమా కోసం చెన్నై తమిళ స్లాంగ్‌లో అజిత్ డైలాగులు చెబుతాడని సమాచారం. విశ్వాసం సినిమా అభిమానుల అంచనాలు మించేలా , చరిత్రలు తిరగరాసేలా తెరకెక్కుతుందని కోలీవుడ్ టాక్ . విశ్వాసం చిత్రంలో అజిత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది . గతంలో అజిత్‌తో కలిసి తొలిసారిగా ఏగన్ అనే చిత్రం చేసింది నయనతార . ఆ తర్వాత బిల్లా, ఆరంభం అనే చిత్రాలలో కలిసి నటించారు. ఇప్పుడు విశ్వాసం చిత్రంతో నాలుగో సారి జతకడుతున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి