టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు భారీ ఆఫర్ ప్రకటించిన నిఖిల్ గౌడ..
- August 25, 2018
'జాగ్వార్' చిత్రం తో వెండి తెరకు పరిచమైన కర్ణాటక సిఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ..మొదటి సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకొని , భారీ ఖర్చే చేసారు కానీ సినిమా మాత్రం అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లకు భారీ ఆఫర్ ప్రకటించాడు.
తనను హీరోగా నిలబెట్టే మంచి కథతో ఎవరైనా స్టార్ డైరెక్టర్ వస్తే ఆయనకు 5 కోట్ల రూపాయల చెక్ అందించేందుకు రెడీగా ఉన్నట్టు ప్రకటించాడు. ఈ ఆఫర్ కేవలం టాలీవుడ్ కు మాత్రమే అని చెప్పడం కోసం మెరుపు. ఈయన కు కన్నడ చిత్రసీమలో ఎలాంటి ఇబ్బందిలేదు. కానీ తెలుగులో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తుంది. మరి నిఖిల్ ఆఫర్ ను అంగీకరించే దర్శకుడు మాత్రం టాలీవుడ్ లో ప్రస్తుతం కనిపించడం లేదు. ఎందుకంటే టాప్ డైరెక్టర్లంతా వరుస సినిమాలతో రెండేళ్ల పాటు బిజీ గా ఉన్నారు. మరి రూ. 5 కోట్ల కోసం ఎవరైనా ముందుకు వస్తారనేది చూడాలి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి