నర్తనశాల ప్రీ రిలీజ్ ఫంక్షన్..

నర్తనశాల ప్రీ రిలీజ్ ఫంక్షన్..

యువ కథానాయకుడు నాగశౌర్య నటించిన తాజా చిత్రం నర్తనశాల. యామినీ భాస్కర్‌, కశ్మీరా నాయికలుగా నటించారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి నర్తనశాల చిత్రాన్ని తెరకెక్కించారు. నర్తనశాల ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ..నర్తనశాల అనే టైటిల్‌ పెట్టి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ చిత్రరాజం పేరును పెట్టుకుని ఆ పాత్రలను ఊహామాత్రంగా తీసుకుని చాలా వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. దర్శకుడు శ్రీనివాస్‌ నాకు కుటుంబ సభ్యుడు. వినోదాత్మక చిత్రాలకు ఆదరణ బాగా పెరుగుతోంది. నర్తనశాలతో అది కొనసాగాలని కోరుకుంటున్నా. నాగశౌర్యకు గొప్ప తల్లిదండ్రులున్నారు. అది అతని అదృష్టం. అన్నారు.
దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ.నన్ను నమ్మి తొలి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి సినిమా చేశానని నమ్ముతున్నాను. నర్తనశాల ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. నాకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులను మర్చిపోలేను. అన్నారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ.వంశీ పైడిపల్లి గారు మా చిత్రానికి మొదటినుంచీ సహకారం అందిస్తున్నారు. సాగర్‌ మహతి ఛలో తర్వాత మరో సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. ఆ చిత్రంలో చూసీ చూడంగానే పాటలా. ఇందులో ఎగిరే ఎగిరే పాట చాలా పేరు తీసుకొచ్చింది. దర్శకుడు చెప్పిన కథను అలాగే తెరకెక్కించారు. కశ్మీరా, యామినీ చక్కగా నటించారు. ఇక మా అమ్మానాన్నలు నాకో పెద్ద అండ. నర్తనశాల అందరికీ నచ్చుతుంది. అన్నారు. శివాజీ రాజా మాట్లాడుతూ.ఇప్పటిదాకా 450 చిత్రాల్లో నటించాను. ఈ సినిమా నాకోసమే చేశారా అన్నట్లు ఉంటుంది. అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్‌ రెడ్డి, దర్శకురాలు నందినీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top