"@నర్తనశాల"కు హిజ్రాల సెగ
- August 28, 2018
ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్న '@నర్తనశాల' సినిమాకి శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. నాగశౌర్య సరసన అందాల భామ కశ్మీరా పరదేశి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదలవుతుండడంతో '@నర్తనశాల'కు సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్రబృందం. ఈ సందర్భంగా నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
నాగశౌర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'గే' పాత్రను పోషించడం కష్టమైన విషయం. కానీ తన ఫ్రెండ్స్ లో చాలామంది 'గే'లు ఉన్నారని, చాలాసార్లు పార్టీల్లో కూడా వాళ్ళను కలుస్తుండడం వల్ల వారి బాడీ లాంగ్వేజ్ ను దగ్గరగా పరిశీలించే ఛాన్స్ వచ్చిందని, అలా పరిశీలించడం వల్లనే '@నర్తనశాల' సినిమాలో నటించాను అంటూ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది.
తమ మనోభావాలను దెబ్బతీస్తూ, హిజ్రాలను కించపరిచే సన్నివేశాలను చిత్రంలో నుంచి తొలగించాలని, లేదంటే '@నర్తనశాల' సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇంకా కొంతమంది హిజ్రాలు హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితి కాసేపు ఉద్రిక్తంగా మారింది.
అయితే ఇటీవల కాలంలో సినిమా విడుదలకు ముందు వివాదాల పాలైన సినిమాలు విజయవంతమై ఆ చిత్రంలో నటించిన నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్100, గీతగోవిందం చిత్రాలే ఇందుకు నిదర్శనం. మరిప్పుడు వివాదాల్లో చిక్కుకున్న '@నర్తనశాల'కు ఆ వివాదాలు ఎంత మేరకు ఉపయోగపడతాయో చూడాలి. ఆగష్టు 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







