కారులో ఊపిరి ఆడక 5 ఏళ్ళ చిన్నారి మృతి
- August 28, 2018
మస్కట్: ఐదేళ్ళ చిన్నారి, కారులో ఊపిరి ఆడక మృతి చెందినట్లు రాయల్ ఒమన్ పోలీస్ చెప్పారు. ఆగస్ట్ 22న ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో పిల్లల్ని వదిలి వెళ్ళకూడదనీ, ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఏసీ సరిగ్గా పనిచేస్తోందో లేదో చూసుకోవాలనీ, తగినంత గాలి కారులోకి వచ్చేలా చూసుకోవాలని, ఎండలో కార్లను నిలిపివేయాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని వదలడం మంచిది కాదని పోలీసులు సూచించారు. పార్క్ చేసిన కారులో ఒక్కోసారి ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు కూడా చేరుకుంటుందని ఒమన్ రోడ్ సేఫ్టీ అసోసియేషన్ సిఇఓ అలి అల్ బర్వాని చెప్పారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







