బంగ్లాదేశ్‌లో మహిళా జర్నలిస్ట్ దారుణ హత్య
- August 29, 2018
బంగ్లాదేశ్ లో సుబర్ణ నోది(32) అనే మహిళా జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చిన ఆగంతుకులు కాలింగ్ బెల్ మోగించారు. ఆమె తలుపు తీయగానే పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. సుబర్ణ నోది ఆనంద టీవీ ఛానల్‌లో న్యూస్ కరస్పాండెంట్‌గా పనిచేసేవారు. డైలీ జాగృతో బంగ్లా పత్రికకు విలేకరిగా సేవలందిస్తున్నారు. తొమ్మిదేళ్ల కూతురితో కలిసి జీవిస్తున్న ఆమె భర్త నుంచి విడాకుల కోసం ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







