టాలీవుడ్ లేడీ డైరెక్టర్ జయ కన్నుమూత
- August 30, 2018
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. మహిళా దర్శకురాలు జయ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంత కాలంగా జయ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాత్రి కన్ను మూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చంటిగాడు సినిమాతో టాలీవుడ్‌కు దర్శకురాలిగా పరిచయమయ్యారు జయ. అతి తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.. టాలీవుడ్‌లో ఉన్న అతి కొద్ది మంది లేడీ డైరెక్టర్లలో జయ ఒకరు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయ రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సినిమాల్లోకి రాకముందు ఓ ప్రముఖ పత్రికలో సినీ జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చారు.. సూపర్ హిట్ పేరిట సొంతగా సినిమా పత్రికను ప్రారంభించారు జయ. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ, వైశాఖం వంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
వైశాఖం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు జయ.. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడింది. తాజాగా మరో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. కొన్నాళ్లుగా కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రాత్రి ఆరోగ్యం మరింత విషమించడంతో కన్నుమూశారు. జయ వయసు 54 సంవత్సరాలు. జయ మరణవార్తతో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







