ఖతార్‌లో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!

- November 08, 2025 , by Maagulf
ఖతార్‌లో సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!

దోహా: ఖతార్ లో సెప్టెంబర్ రెండవ భాగంలో ప్రారంభిన జాతీయ సీజనల్ ఇన్‌ఫ్లుఎంజా టీకా ప్రచారాన్ని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది.  హమద్ మెడికల్ కార్పొరేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ మరియు ప్రభుత్వ, సెమీ-గవర్నమెంటల్ మరియు ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాల సహకారంతో అమలు చేస్తున్నారు.

నవంబర్ మొదటి వారం వరకు ప్రచారం ప్రారంభించినప్పటి సుమారు 58 వేలమంది వ్యక్తులకు టీకాలు వేశారు. ఈ మేరకు  ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఈ సంవత్సరం 103 కి పైగా ఆరోగ్య కేంద్రాలలో ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.  

ఇన్ఫ్లుఎంజా టీకా కోసం ప్రాధాన్యత ఇవ్వబడిన సమూహాలలో షుగర్,  గుండె మరియు ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండాల బలహీనత మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి దీర్ఘకాలిక పరిస్థితులు ఉన్న వ్యక్తులకు మేలు చేస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు పైబడిన వారు), 6 నెలల నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com