కేరళకు 'ARR' భారీ విరాళం
- September 03, 2018
అమెరికా: ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ కేరళకు భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. తమ బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచినట్లు పేర్కొన్నారు. రెహమాన్ ఆదివారం తన బృందంతో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని వేదికపై ప్రకటించారు. 'నేను, నా ఆర్టిస్టులు అమెరికా టూర్లో పాల్గొన్నాం. కేరళ సోదర సోదరీమణుల కోసం మా వంతు సాయం చేశాం. ఈ చిన్న విరాళం మీకు కాస్త ఊరట ఇస్తుందని ఆశిస్తున్నాం' అని రెహమాన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా చెక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
ఈ టూర్లో భాగంగా ఇటీవల రెహమాన్ కేరళ వరద బాధితులను ఉద్దేశించి పాట పాడారు. 'కేరళ, కేరళ, డోన్ట్ వర్రీ కేరళ' అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెబుతూ పాడిన పాటకు మంచి స్పందన లభించింది. ఈ టూర్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో రెహమాన్ భారత్ తిరిగి రానున్నారట. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న 'నవాబ్' సినిమా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకలో రెహమాన్ ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే అనేక మంది సినీ తారలు కేరళకు విరాళాలు అందించారు. షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, రజనీకాంత్, అల్లు అర్జున్, మమ్ముట్టి, ప్రభాస్, చిరంజీవి, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ధనుష్, నయనతార, విశాల్ తదితరులు విరాళం అందించిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







