1050 కిలోమీటర్ల నడక: పాకిస్తానీ ఘనత

- December 17, 2015 , by Maagulf
1050 కిలోమీటర్ల నడక: పాకిస్తానీ ఘనత

 


ఇద్రిస్‌ 1050 కిలోమీటర్ల దూరం నడిచి రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌కి చెందిన 55 ఏళ్ళ మాలిక్‌ మహమ్మద్‌ ఇద్రిస్‌ 44వ యూఏఈ నేషనల్‌ డే సందర్భంగా ఈ ఫీట్‌ చేపట్టాడు. ఇద్రిస్‌ 13 రోజుల ప్రయానం సోమవారంతో ముగిసింది. యూఏఈలో 30 ఏళ్ళుగా నివసిస్తున్న ఇద్రిస్‌కి ఈ నడక ఫీట్‌ కొత్తేమీ కాదు. ఫజారియా నుంచి అబుదాబీ వరకు గతంలో ఆయన 400 కిలోమీటర్ల దూరం నడిచాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న ఇద్రిస్‌ డిసెంబర్‌ 2న హట్టాలో నడక ప్రారంభించాడు. మజీరా, మద్దమ్‌, కల్బా, ఫజారియా, ఖోర్‌ ఫాకన్‌ మరియు దిబ్బాల మీదుగా నడక సాగించాడు. రస్‌ అల్‌ఖైమాస్‌లోని వాదిస్‌ మరియు హిల్స్‌ ద్వారా ఉమ్‌ అల్‌ ఖెవైన్‌, అజ్మాన్‌ షార్జా, దుబాయ్‌లలోనూ నడిచాడు. రోజుకు అరవై కిలోమీటర్ల దూరం నడక సాగించాడు ఇద్రిస్‌. 2016లో దుబాయ్‌ నుంచి లండన్‌ వరకు సుమారు 5000 కిలోమీటర్ల దూరం నడక మార్గంలో ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎనిమిది నెలల్లో ఈ లక్ష్యాన్ని చేరుకుంటాడట. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com