తెలంగాణ అసెంబ్లీ రద్దుపై మధ్యాహ్నం ప్రకటన
- September 05, 2018
అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఉత్కంఠకు నేడు తెరపడనుందని ఈనాడు పేర్కొంది. ఈ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం నిర్వహించి ఏక వాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేస్తారని తెలిపింది.
ఉదయం ఆరున్నర గంటలకు లేదా.. మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉందని వివరించింది.
ఈరోజు కథనం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేస్తుందని, లేదా 11 నుంచి 12 గంటల మధ్యలో ఉండొచ్చని చెబుతున్నారు.
గురువారం ఉదయం ఆరుగంటలకు అందుబాటులో ఉండాలని మాత్రం మంత్రులకు చెప్పినట్లు స్పష్టమవుతుంది. సభ రద్దు నిర్ణయం తీసుకొని, గవర్నర్‌ను కలిసి తీర్మానం అందజేసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి విలేఖరుల సమావేశంలో మాట్లాడతారని, ఈ సమయంలోనే దాదాపు 50 మంది వరకు అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తారని సమాచారం.
విలేఖరుల సమావేశం తెరాసభవన్లో జరగనుంది. మంత్రివర్గ ఆమోదం కోసం వివిధ శాఖల నుంచి భారీగా వచ్చిన ప్రతిపాదనలను పక్కనపెట్టినట్లు తెలిసింది.
ముందస్తు ఊహాగానాలపై కేసీఆర్..కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
శాసన సభ రద్దుకు ప్రభుత్వం గురువారం సిఫారసు చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీపీసీసీ ఒకరోజు ముందే.. అంటే గురువారమే ఎన్నికల హామీలు గుప్పించిందని ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఆ కథనం ప్రకారం..
తాము అధికారంలోకి వస్తే రూ.5 లక్షలతో రెండు పడకగదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లకు మరో గది, బీసీ, మైనారిటీలకు సబ్ ప్లాన్, ఉచితంగా దళిత, గిరిజనులకు 200 యూనిట్ల వరకూ విద్యుత్తు తదితరాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. రానున్న రెండు మూడు వారాల్లో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మేనిఫెస్టోలను ప్రకటిస్తామని ఉత్తమ్ చెప్పారు.
25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెడీ: కోదండరాం
ఏదైనా నిర్మాణం చేపట్టడానికి ముహూర్తం కావాలి తప్ప, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏవరైనా ముహూర్తం చూస్తారా? అని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పేర్కొన్నారని సాక్షి తెలిపింది. కోదండరామ్ జన్మదినం సందర్భంగా టీజేఎస్ కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమేనని, 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల ప్రచార కమిటీలు పని చేస్తున్నాయని, ఇంటింటికి జన సమితి కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
తెలంగాణలో ఐదు నెలల్లో 21% వృద్ధి
తెలంగాణ సొంత రాబడులను గణనీయంగా పెంచుకుంటూ బెస్ట్ ఎకనామిక్ స్టేట్‌గా దేశంలో తనదైన ముద్రను వేసుకుంటోందని నమస్తే తెలంగాణ పేర్కొంది. ఆ కథనం ప్రకారం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే అంచనాలకు మించి స్టేట్ ఓన్టాక్స్ల ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకొని తెలంగాణ మరో సారి అగ్రగామిగా దూసుకుపోతోంది.
ఏటా సగటు 17నుంచి 18 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటున్న రాష్ట్రం ఈ సారి ఐదు నెలల్లోనే ఏకంగా 21 శాతానికి పైగా వృద్ధి రేటును సాధించి బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. 2018-19లో ఆగస్టు నెలాఖరు వరకు రూ.26,394.18 కోట్ల ఆదాయం సమకూరింది.
గత ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.21,642 కోట్లతో పోలిస్తే ఇది 21.96 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఇంత భారీ వృద్ధిరేటును సాధించిన రాష్ర్టాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి