బ్రిటిష్ ఎయిర్వేస్:3.8 లక్షల కార్డుల్లోని డేటా అపహరణ
- September 07, 2018
బ్రిటిష్ ఎయిర్ వేస్ వెబ్ సైట్ ను ఐటీ మోసగాళ్లు హ్యాక్ చేశారు. ఈ హ్యాకింగ్ అనేది ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు వారాల పాటు హ్యాక్ చేస్తూనే పోయారు. ఫలితంగా 3,80,000 మంది కార్డుల్లోని సమాచారాన్ని కొల్లగొట్టారు. ఈ విషయాన్ని బ్రిటిష్ ఎయిర్ వేస్ అథారిటీస్ అంగీకరించి ప్రయాణికులకు క్షమాపణలు తెలిపాయి.
ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు తమ వెబ్ సైట్ ను మోసగాళ్లు హ్యాక్ చేశారని, ఆ సమయంలో కస్టమర్లు వాడిన డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల్లోని డేటా అపహరణకు గురైందని, అందుకు చింతిస్తున్నామని ఎయిర్ వేస్ అధికారులు అంగీకరించారు. ఎలాంటి నష్టం జరిగినవారైనా, ఎలాంటి కంప్లయింట్ ఉన్నా తమను సంప్రదిస్తే విచారించి న్యాయం చేస్తామన్నారు.
అయితే అప్పటికే అనుమానం వచ్చిన పలువురు కస్టమర్లు ఎయిర్ వేస్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లయి ఇవ్వలేదని ఫిర్యాదు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







