కౌశల్ పై కన్నేసిన అల్లు అరవింద్
- September 11, 2018
ఎవరికైనా క్రేజ్ ఉన్నప్పుడు క్యాష్ గా మార్చుకోవాలని ఆలోచించేవాళ్ళు చాలా కొద్దిమంది వుంటారు. దాన్నే మన పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు. ఇలా ఎదుటివాడి టాలెంట్ ని అనుకూలంగా మలుచుకోవడంలో కూడా నేర్పు ఉండాలి. అందులో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దిట్ట. కాస్తంత టాలెంట్ ఉంటే, దానికి సానబెట్టి ప్రోత్సహించడం తద్వారా నాలుగు డబ్బులు వెనకేసుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్యగా ఇండస్ట్రీలో పేరుంది. ఇక ఇష్టం లేని వాళ్ళను తొక్కేయ్యడానికి కూడా వెనుకాడదని కూడా అంటుంటారు.
ఏది ఏమైనా అల్లు అరవింద్ బుర్రే బుర్ర అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో ఫామ్ లోకి వచ్చిన విజయ్ దేవరకొండను తన కాంపౌండ్ లోకి తెచ్చేసుకోవడం ఇందుకు తాజా ఉదాహరణ. గీతా బ్యానర్ లో ఒకరు , జి 2బ్యానర్ లో రెండు చేసేస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు , తమిళ భాషల్లో వస్తున్న నోటా మూవీని తన బ్యానర్ లాంటి తమిళ నిర్మాత జ్ఞాన్ విల్ రాజా బ్యానర్ లో తీస్తూ బాగానే ఉపయోగించున్నాడు.
ఇప్పుడు మరో పాపులర్ వ్యక్తి క్రేజ్ ని కూడా వినియోగించుకునే పనిలో పడ్డారని అరవింద్ కి అత్యంత సన్నిహితుల నుంచి విన్పిస్తున్న మాట.
అదేనండి బిగ్ బాస్ సీజన్ టు షో ద్వారా అశేష అభిమానులను సొంతంచేసుకుని,సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ వంటి బలమైన అభిమాన సంఘం క్రియేట్ చేసుకున్న కౌశల్. బిగ్ బాస్ లో ఇప్పుడు విన్నర్ గా నిలవబోతున్న కౌశల్ పై టాలీవుడ్ లో కొందరు కన్నేశారు.
అయితే అందరికన్నా ముందుండే అరవింద్ తీరేవేరు కదా. అందుకే కౌశల్ క్రేజ్ కి తగ్గట్టు సినిమాలు రూపొందించే పనిలో అరవింద్ నిమగ్నం అయ్యారట. కౌశల్ కి తగ్గ కథలు రెడీ చేయాలని రైటర్స్ కి సూచించారట. కౌశల్ బయటకు రాగానే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు తీయడానికి డీల్ కుదుర్చుకోడానికి రంగ సిధ్దం చేసుకున్నారట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







