వెండితెర మామా అల్లుళ్లు..
- September 13, 2018దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. వినాయకచవితి సందర్భంగా నిన్న చిత్రబృందం సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తోన్న రానా లుక్ ని విడుదల చేశారు.
తాజాగా చిత్రబృందం మరో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ గా బాలయ్య, ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడిగా రానా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని విడివిడిగా విడుదల చేశారు. ఈసారి మామా అల్లుళ్లు కలిసే వచ్చారు. పోస్టర్ లో ఎన్టీఆర్ తన అల్లుడుపై చేయి వేసి మాట్లాడుతున్నట్లుగా చూపించారు. ఈ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో బసవతారకం పాత్రలో విద్యాబాలన్, ఏఎన్నార్ గా సుమంత్ కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్