పార్టీ గీత దాటితే వేటు తప్పదు…నేతలకు రాహుల్ హెచ్చరిక
- September 14, 2018
తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగుంది! నాయకులు బహిరంగ విమర్శలు మానుకుని.. ఐకమత్యంగా ముందుకెళ్లాలి! ఇది టి కాంగ్రెస్ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన హితోపదేశం. ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే బరిలో దించాలన్నరాహుల్ గాంధీ.. పెండింగ్ లో ఉన్న పీసీసీ కమీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణపై కాంగ్రెస్ అదిష్టానం సీరియస్‌గా దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా అధికారంలోకి రాకపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతోంది పార్టీ హైకమాండ్. ఈసారి ఎలాగైనా తెలంగాణ గట్టుపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పట్టుదలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ముందస్తు ఎన్నికలకు ముహూర్థం ఖరారు కావడంతో.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ఆలీతోపాటు.. పార్టీలోని 40మంది సీనియర్లను ఢిల్లీకి పిలిచిన రాహుల్ గాంధీ .. ముందస్తు ఎన్నికల‌్లో వ్యవహరించాల‌్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీ పొత్తులు, టిక్కెట్ల అంశంపై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లడొద్దని క్లాస్ తీసుకున్నారు. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడితే.. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించిన రాహుల్.. రాష్ట్ర నేతలకు ఏకతా మంత్రం ఉపదేశించారు. పార్టీ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.
ఇక తెలంగాణలో మహాకూటమి కి సంబంధించి పలు సూచనలు చేశారు రాహుల్ గాంధీ . సీట్ల సర్దుబాటులో పార్టీకి నష్టం జరగకుండా జాగ్రత్తలు చూసుకోవాలన్న రాహుల్ గాంధీ … గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని సూచించారు. రెబల్స్ బరిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పీసీసీ ఛిప్ ఉత్తమ్‌ను ఆదేశించారు. తెలంగాణలో ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చాలని.. కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న రాహుల్.. ప్రజా రంజకంగా మ్యానిఫెస్టో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు పెండింగ్ లో ఉన్న పీసీసీ ప్రచార, మ్యానిఫెస్టో, సమన్వయ కమీటీలకు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాదు మాజీ ఎంపీ భక్త చరణ్ దాస్ నేతృత్వంలో పీసీసీ స్క్రీనీంగ్ త్రీసభ్య కమీటీని నియమించారు రాహుల్ గాంధీ. ఇక పీసీసీ ప్రచార, మ్యానిఫెస్టో, సమన్వయ కమీటిలను కూడా ప్రకటించనున్నారు రాహుల్. దీనితో పాటు.. పీసీసీ అదనంగా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా ప్రకటిస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
మెత్తానికి గులాబీ బాస్ తో తాడో పేడో తేల్చుకుని.. తెలంగాణ గట్టుపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. దీనికి గాను ఒకవైపు సొంతింటి కుంపట్ల కు చెక్ పెడుతూనే., ఎన్నికలల్లో కేసీఆర్‌ను ఓడించేందుకు యాక్షన్ ప్లాన్ ఉపదేశించింది హైకమాండ్. మరి ఢిల్లీ స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ఏమేరకు తెలంగాణలో కాంగ్రెస్ కు విజయాన్నికట్టబెడతాయో చూడాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







