శంషాబాద్ ఎయిర్పోర్ట్ టాప్..వరుసగా రెండో సారి అవార్డు.!
- September 14, 2018
హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం మరోసారి సేవల రంగంలో అత్యత్తమ ప్రదర్శన కనబర్చింది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈ అవార్డు రావడం వరసగా ఇది రెండో సారి. 2016లో కూడా ప్రపంచ అత్యత్తమ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్ సంస్థ చేపడుతోంది. సేవల రంగంలో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అవార్డు దక్కించుకుందని తెలిపారు ఆ సంస్థ సీఈఓ కిషోర్. కస్టమర్ల సంతృప్తి పరచడమే తమకు ముఖ్యమని ఇందుకోసం ఎక్కడా రాజీ పడబోమని కిషోర్ తెలిపారు. కస్టమర్ల అంచనాలను తాము అందుకునేందుకు మరింత కృషి చేస్తామని కిషోర్ తెలిపారు. ఈ అవార్డు రావడం వారి బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు.
ఈ అవార్డు రావడంలో ప్రతిఒక్కరి కృషి ఉందని కిషోర్ తెలిపారు. స్టేక్ హోల్డర్స్, కేంద్ర పౌరవిమానాయాన మంత్రిత్వశాఖ,ఇమ్మిగ్రేషన్, ఇతరత్రా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీద ఏసీఐ ఏఎస్‌క్యూ ఇచ్చిన అవార్డుతో ఇప్పటి వరకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీ విమానాశ్రయం వరుసగా 9 సార్లు టాప్ 3 అత్యుత్తమ విమానాశ్రయాల్లో నిలిచింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







