శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టాప్..వరుసగా రెండో సారి అవార్డు.!

- September 14, 2018 , by Maagulf
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ టాప్..వరుసగా రెండో సారి అవార్డు.!

హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం మరోసారి సేవల రంగంలో అత్యత్తమ ప్రదర్శన కనబర్చింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈ అవార్డు రావడం వరసగా ఇది రెండో సారి. 2016లో కూడా ప్రపంచ అత్యత్తమ ఎయిర్‌పోర్ట్‌గా నిలిచింది రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బాధ్యతలు జీఎంఆర్ సంస్థ చేపడుతోంది. సేవల రంగంలో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి అవార్డు దక్కించుకుందని తెలిపారు ఆ సంస్థ సీఈఓ కిషోర్. కస్టమర్ల సంతృప్తి పరచడమే తమకు ముఖ్యమని ఇందుకోసం ఎక్కడా రాజీ పడబోమని కిషోర్ తెలిపారు. కస్టమర్ల అంచనాలను తాము అందుకునేందుకు మరింత కృషి చేస్తామని కిషోర్ తెలిపారు. ఈ అవార్డు రావడం వారి బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు.

ఈ అవార్డు రావడంలో ప్రతిఒక్కరి కృషి ఉందని కిషోర్ తెలిపారు. స్టేక్ హోల్డర్స్, కేంద్ర పౌరవిమానాయాన మంత్రిత్వశాఖ,ఇమ్మిగ్రేషన్, ఇతరత్రా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీద ఏసీఐ ఏఎస్‌క్యూ ఇచ్చిన అవార్డుతో ఇప్పటి వరకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీ విమానాశ్రయం వరుసగా 9 సార్లు టాప్ 3 అత్యుత్తమ విమానాశ్రయాల్లో నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com