సైమా అవార్డ్స్ 2018 విజేతలు వీరే.!

- September 15, 2018 , by Maagulf
సైమా అవార్డ్స్ 2018 విజేతలు వీరే.!

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా లో బాహుబలి 2కి అవార్డుల పంట పండింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల చిత్రాల అవార్దుల కార్యక్రమం సైమా 2018 దుబాయ్ లో నటీమణుల గ్లామర్ తో , రాక్ పర్ఫార్మెన్స్ తో, సెలబ్రిటీల ఆట పాటలతో గత రాత్రి ప్రారంభమైంది.. రెండు రోజులు పాటు జరిగే ఈ వేడుకలలో తొలి రోజున తెలుగు, తమిళ భాష చిత్రాలకు అవార్డుల అందజేశారు..'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏకంగా 12 విభాగాల్లో నామినేషన్లను దక్కించుకోగా, ఏడు అవార్డులను గెలుచుకుంది.. గౌతమి పుత్ర శాతకర్ణికి ఉత్తమ క్రిటిక్ చిత్రంగా అవార్డుతో పాటు, క్రిటిక్ ఉత్తమ హీరో అవార్డు బాలయ్య దక్కించుకున్నాడు.. లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్ పి. సుశీలకు అందజేశారు. దుబాయ్ లో ఈ కార్యక్రమాన్ని అంజన్ స్టార్ ఈవెంట్స్ వారు నిర్వహిస్తున్నారు.

టాలీవుడ్ : అవార్డుల వివరాలు
ఉత్తమ చిత్రం - బాహుబలి 2
క్రిటిక్స్ ఉత్తమ చిత్రం - గౌతమి పుత్ర శాతకర్ణి.
వినోదాత్మక చిత్రాలు - బాహుబలి 2. ది ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి
ఉత్తమ దర్శకుడు - రాజమౌళి (బాహుబలి 2)
ఉత్తమ హీరో - ప్రభాస్ ( బాహుబలి 2)
క్రిటిక్స్ ఉత్తమ హీరో - బాలకృష్ణ - గౌతమి పుత్ర శాత కర్ణి
ఉత్తమ హీరోయిన్‌- కాజల్ ( నేనే రాజు నేనే మంత్రి)
క్రిటిక్స్ ఉత్తమ హీరోయిన్ - రితికా సింగ్ - గురు
ఉత్తమ సహాయ నటుడు - ఆది ( నిన్ను కోరి)
ఉత్తమ సహాయ నటి - భూమిక ( ఎంసీఏ)
ఉత్తమ సంగీత దర్శకుడు - ఎంఎం కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ గాయని - మధుప్రియ (ఫిదా)
ఉత్తమ గాయకుడు - కాల భైరవ ( బాహుబలి 2)
ఉత్తమ విలన్ - రానా ( బాహుబలి 2)
ఉత్తమ సినిమాలోగ్రాఫర్ - సెంథల్ కుమార్ - బాహుబలి 2
ఉత్తమ హాస్య నటుడు - రాహుల్ రామకృష్ణ - అర్జున్ రెడ్డి
తొలి పరిచయం హీరో - ఇషాన్ . రోగ్
తొలి పరిచయం హీరోయిన్ - ప్రియదర్శిని - హలో
తొలి పరిచయం దర్శకుడు - సందీప్ వంగా - అర్జున్ రెడ్డి
తమిళ మూవీ అవార్డు వివరాలు
ఉత్తమ చిత్రం - విక్రమ్ వేద
ఉత్తమ దర్శకుడు - అట్లీ ( మెర్సల్‌)
ఉత్తమ హీరో - శివ కార్తికేయన్‌
ఉత్తమ హీరోయిన్‌- నయనతార
ఉత్తమ సహాయ నటుడు - ఎంఎస్ భాస్కర్
ఉత్తమ సహాయ నటి - శివద
ఉత్తమ సంగీత దర్శకుడు - ఏ ఆర్ రెహమాన్
ఉత్తమ గాయని - లుక్సిమి శివనేశ్వరి
ఉత్తమ గాయకుడు - సిద్ శ్రీరామ్‌
ఉత్తమ విలన్ - ఎస్‌జే సూర్య

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com