'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' లోని అమితాబ్ ఫస్ట్ లుక్
- September 18, 2018
70 ఏళ్లు పైబడ్డాక కూడా అలుపెరగకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు అమితాబ్ బచ్చన్. ఐతే ఏదో మొక్కుబడిగా సినిమాలు చేయడం కాదు.. చాలా విలక్షణమైన పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం అమితాబ్.. అమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్న 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'పై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే.
ఈ సినిమాలో అమితాబ్ పాత్ర గురించి ముందు నుంచే బాలీవుడ్ జనాలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ రోజు రిలీజ్ చేసిన బిగ్-బి పాత్ర తాలూకు ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో అమితాబ్ ఖుదాబక్ష్ అనే పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం సముద్రపు దొంగల నేపథ్యంలో సాగుతుంది. దాన్ని సూచిస్తూ ఒక భారీ ఓడను నడిపించే కెప్టెన్ గా అమితాబ్ కనిపించాడు. ఆయన లుక్ లో రాజసం కనిపిస్తోంది. లుక్ తో పాటు కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి.
మామూలుగానే అమీర్ సినిమాలంటే ప్రత్యేకం అన్న భావన ఉంటుంది. ఇక అతను తొలిసారి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. 'ధూమ్' సిరీస్ లో తొలి రెండు చిత్రాలకు రచన చేసి... 'ధూమ్-3' దర్శకుడిగా మారిన విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
దీపావళి కానుకగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ఒక నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. సముద్రంలో దొంగతనాల నేపథ్యంలో చాలా థ్రిల్లింగ్ ఈ చిత్రం సాగుతుందట. దీని కోసం అమీర్ ఖాన్ పూర్తిగా అవతారం మార్చేశాడు. సన్నబడ్డాడు. జుట్టు పెంచాడు. ముక్కుకు.. చెవులకు కమ్మలతో చిత్రంగా కనిపించబోతున్నాడు. కత్రినా కైఫ్ ఇందులో అతడికి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







