నేడు భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్..
- September 18, 2018
దుబాయ్: దాదాపు 14 నెలల తర్వాత... క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తున్న ఓ ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చరిత్ర.. గణాంకాలు.. రికార్డులు.. రివార్డులు.. విశ్లేషణలు.. విమర్శలు.. భావోద్వేగాలు.. వీటన్నింటిని పక్కనబెడితే మ్యాచ్‌ను చూస్తే చాలు అనుకునే అభిమానగణం ఆనందోత్సాహాల్లో తేలియాడే అపురూపమైన క్షణాలకు సమయం ఆసన్నమైంది. విజయబావుటకు, ఓటమిబాటకు అతి స్వల్ప తేడా ఉండే అత్యుత్తమ సమరానికి ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో.. బుధవారం ఆసియా కప్‌లో భాగంగా జరిగే గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో భారత్.. పాక్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. పేపరు మీద చూస్తే ఇరుజట్లు బలంగానే కనిపిస్తున్నా.. మైదానంలో అసలు సిసలు ఆట ఎవరూ ఆడుతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. గతేడాది చాంపియన్స్ ట్రోఫీలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తుంటే.. చరిత్రను పునరావృతం చేస్తామని దాయాది జట్టు ధీమాతో ఉంది. ఎన్ని విశ్లేషణలు చేసినా.. ఎన్ని రకాలుగా మాట్లాడినా.. నిజాయితీగా భారత్ బ్యాటింగ్ బలానికి, పాక్ బౌలింగ్ బలగానికి మధ్య జరిగే అత్యంత కఠిన పరీక్ష ఇది. ఇందులో ఎవరు నెగ్గుతారో.. ఎవరు తగ్గుతారో చూడాలి..!
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







