కూతురిపై పోలీసులకు ఫిర్యాదు:విజయ్ కుమార్
- September 21, 2018
చెన్నై:నటుడు విజయ్ కుమార్ తన కూతురు వనితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షూటింగ్ అని చెప్పి ఇంటిని వాడుకుంటూ ఖాళీ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. చెన్నై మధురవాయిల్, అలపాక్కమ్లోని అష్టలక్ష్మి నగర్ 11వ వీధిలో విజయ్ కుమార్ ఆయన కొడుకుతో కలిసి నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన కూతురు వనిత షూటింగ్ నిమిత్తం ఆ ఇంటిలోని కొంతభాగాన్ని వాడుకుంటోంది. ఈ క్రమంలో సినిమా పూర్తయినా కూడా ఆ ఇంటిని ఖాళీ చేయలేదు. పైగా సినిమా నిర్మాణానికి సంబంధించిన వస్తువులు అక్కడే ఉంచడంతో అసౌకర్యంగా ఉందని ఖాళీ చెయ్యమని కూతురుని హెచ్చరించాడు విజయ్ కుమార్. కానీ వనిత ఖాళీ చేయలేదు. దీంతో విజయ్ కుమార్ వనితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం ఆ ఇంటికి చేరుకోగా వారిని వెళ్లిపోవాలని.. ఈ ఇంట్లో తనకు భాగముందని సమాధానమిచ్చింది. ఇంట్లో భాగం ఉంటే ఆధారాలు చూపించాలని ఆమెను పోలీసులు కోరడంతో కాసేపు వారిపై కూడా చిందులు తొక్కింది. అంతేకాదు తాను ఇళ్లు ఖాళీ చేయనని వాగ్వాదానికి దిగింది.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







