'దేవదాస్' సినిమా ఆడియో విడుదల

- September 20, 2018 , by Maagulf
'దేవదాస్' సినిమా ఆడియో విడుదల

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ దేవదాస్ . నాగార్జున, నాని ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. కొద్ది రోజులుగా టీజర్‌, సాంగ్స్‌తో అలరించిన టీం నిన్న జరిగిన ఆడియో వేడుకలో ట్రైలర్ విడుదల చేసింది. 2:06నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ చూస్తుంటే చిత్రం మొత్తం ఫుల్‌ కామెడీగా ఉంటుందని అనిపిస్తుంది. నాగ్ ,నాని ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈచిత్రానికి హైలైట్ కానున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. దేవ పాత్రలో నాగార్జున, దాస్ పాత్రలో నానిలు సరికొత్త వినోదాన్ని అందించనున్నారని ట్రైలర్‌ని బట్టి తెలుస్తుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com