ఇయు: ఇరాన్‌తో వ్యాపారానికి ప్రత్యేక చెల్లింపు మార్గాలపై కసరత్తు
- September 25, 2018
బ్రసెల్స్ : ఇరాన్ అణు ఒప్పందం నుండి అమెరికా బయటకు వచ్చేసినా ఇయు దేశాలన్నీ దానికే కట్టుబడి వున్నాయని యురోపియన్ విదేశాంగ వ్యవహారాల చీఫ్ ఫెడెరికా మొగెరిని స్పష్టం చేశారు. ఇరాన్‌తో వ్యాపారం చేసేందుకు ప్రత్యేక చెల్లింపు మార్గాలను సృష్టించేందుకు ఇయు కసరత్తు చేస్తోంది. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జిసిపిఓఎ)పై సంతకాలు చేసిన మిగిలిన దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం అనంతరం మొగెరిని ఒక ప్రకటన చేశారు. ఒప్పందానికి అనుగుణంగా ఇరాన్ వ్యవహరిస్తోందని రష్యా, బ్రిటన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్‌లు ధృవీకరించాయి. చట్టబద్ధంగా ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించేందుకు వీలుగా ప్రత్యేక చెల్లింపు మార్గాలను ఏర్పాటు చేయడంపై ఇయు చర్చలు జరుపుతోందని ఆ ప్రకటన తెలిపింది. ఆంక్షలతో ఇరాన్ చమురు ఎగుమతులను అడ్డగించాలని అమెరికా కుట్ర పన్నుతోంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితిని దృష్టిలో వుంచుకుని, స్పష్టమైన ఫలితాలు సాధించాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆచరణాత్మకమైన ఈ ప్రతిపాదనలను సభ్య దేశాలు స్వాగతించాయని మొగెరిని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్







