అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు
- September 25, 2018
హైదరాబాద్: బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. దుకాణాలు, సంస్థల్లో బతుకమ్మలు ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది కంటే ఘనంగా ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలి. ట్యాంక్‌బండ్, పీపుల్స్‌ప్లాజాలో పండుగ వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసేలా చర్యలు తీసుకోవాలి. పండుగను విశ్వవ్యాప్తం చేయడానికి కమిటీ సూచనలు అందించాలని కోరారు.
ఢిల్లీ, ముంబయలో హోల్డింగ్‌ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కమార్ తెలిపారు. పండుగ ప్రాచుర్యం తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల శాఖ సహకారం తీసుకుంటామని వెల్లడిచారు. పండుగను విశ్వవ్యాప్తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సాంసృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తెలిపారు. విమానాలు, శతాబ్ది రైళ్లలో మహిళలకు బుక్లెట్స్ పంచుతున్నామని పేర్కొన్నారు. అమెరికా, కెనడా, లండన్, దుబాయ్‌లో తెలంగాణ ప్రవాసుల సహాకారంతో పండుగ నిర్వహిస్తామన్నారు. పారిశ్రామికవర్గాల సహాకారంతో 100 ఫ్లోటింగ్ బతుకమ్మలు ఏర్పాటు చేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







