లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరికి నోబెల్ !
- October 05, 2018
స్టాకహేోమ్: లైంగిక హింసకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరికి ఈఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం వరించింది. డాక్టర్ డెనిస్ ముక్వెగె, నదియా మురద్‌లకు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేయనున్నట్టు నోబెల్ కమిటీ చైర్మెన్ బెరిట్ రీస్ అండర్సన్ తెలిపారు.లైంగిక హింసను అరికట్టేందుకు చేసిన కృషికి, లైంగిక దాడి బాధితులకు చేసిన సహాయానికిగానూ నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఈ అవార్డు కింద వీరికి అందనున్న 7.35 కోట్ల(9 మిలియన్ స్వీడిష్ క్రోనాల)ను ఇద్దరు విజేతలు పంచుకోనున్నారు. డెనిస్ మక్‌వెగె (63) కాంగోకు చెందిన ప్రముఖ గైనకాలజిస్టు.
ప్రపంచంలో లైంగికదాడులు, ఘర్షణలు అధ్యధికంగా చెలరేగే దేశంగా కాంగోకు పేరుంది. అక్కడ రోజుకు కొన్ని వందల సంఖ్యలో లైంగికదాడులు జరుగుతాయి. వేర్వేరు తెగలు, నాయకుల మధ్య జరిగే అంతర్గత సాయుధ ఘర్షణల్లో సైనికులు సాధారణ మహిళలపై లైంగికదాడుల పర్వం కొనసాగేది. 1990 దశంలో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో వీటికి వ్యతిరేకంగా మక్‌వెగె ఉద్యమించారు. బాధితులకు న్యాయం కోసం పోరాడారు. వీరికి చికిత్స అందించడంతో పాటు చదువు చెప్పారు. తమ కాళ్లపై తాము నిలబడేట్టు చేయగలిగారు. 2008లో ఆయనకు మానవ హక్కుల పురస్కారం లభించింది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చి ఐరాస నదియాను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. నదియా జీవితాన్ని తెలియజేస్తూ 2017లో 'ది లాస్ట్ గర్ల్' అనే పుస్తకం విడుదలైంది. లైంగిక హింసను అరికట్టేందుకు ఆమె చేస్తున్న కృషికి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి దక్కింది.
నదియా మురద్ (25) ఇరాక్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త. ఆమె యాజిదీ తెగకు చెందిన యువతి. ఐఎస్ మూడు నెలల పాటు బంధించి ఆమెపై లైంగికదాడికి పాల్పడింది. 2014, నవంబర్‌లో ఆమె ఐఎస్ చెర నుంచి తప్పించుకొని బయటకు వచ్చారు.
అనంతరం యాజిదీ మహిళలు, బాలికలపై ఐఎస్ చేస్తున్న ఆకృత్యాల గురించి ప్రపంచ దేశాలకు తెలిపారు. తనపై జరిగిన లైంగిక హింసను, ఇతర యాజిదీ యువతులు అనుభవిస్తున్న నరకం గురించి ప్రపంచానికి తెలియజేశారు. యాజిది యువతులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు పాటుపడ్డారు. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె 23 ఏండ్ల వయసులోనే ఐరాస వేదికపై గళమెత్తారు. ఆమె చేసిన కృషికిగానూ 2016లో వక్లావ్ హావెల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ వరించింది.
యుద్ధాల్లో లైంగిక హింసను ఆయుధంగా ఉపయోగించడాన్ని నిర్మూలించేందుకు డెనిస్, నదియా మురద్లు చేసిన కృషికిగాను 2018 సంవత్సరానికి గానూ స్వీడిష్ అకాడమీ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతి కోసం 331 నామినేషన్లు(216 మంది వ్యక్తులు, 115 సంస్థలు) రాగా ఈ ఇద్దరికి అవార్డు వరించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







