'సాహూ'హీరోయిన్ కి డెంగ్యూ..ఆసుపత్రిలో చికిత్స!
- October 05, 2018
బాలీవుడ్ అందాల భామ శ్రద్దా దాస్ కి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలీవుడ్ లో విలన్, క్యారెక్టర్, కామెడీ పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు శక్తికపూర్ కూతురు శ్రద్దా కపూర్ 'ఆషికీ 2' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలు, యాడ్స్ లో నటిస్తున్న శ్రద్దా కపూర్ తెలుగు లో సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సాహూ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు ఈ మద్య బయోపిక్ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్దా కరపూర్ నటిస్తుంది.
ఇందుకోసం ట్రైనింగ్ కూడా తీసుకుంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రారంభమైంది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ ముద్దుగుమ్మ చిత్రీకరణకు సడెన్‌గా బ్రేక్ ఇచ్చింది. వైద్య పరీక్షల్లో శ్రద్ధాకు డెంగ్యూ సోకినట్టు తేలిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆమె డెంగ్యూ కోసం చికిత్స తీసుకుంటోందని కొన్ని రోజుల అనంతరం ఆమె తిరిగి చిత్రీకరణలో పాల్గొంటుందని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది.
అనారోగ్యం కారణంగా శ్రద్ధా మరికొద్ది రోజులపాటు చిత్రీకరణకు హాజరు కాలేకపోవచ్చు కాబట్టి దర్శకుడు అమోల్ గుప్త తెలిపారు. ప్రస్తుతం సైనా నెహ్వాల్ బయోపిక్ ఆమె చిన్ననాటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. కాగా, శ్రద్దా చిత్రీకరణలో ఎప్పుడు పాల్గొనేది త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత భూషణ్ కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







