స్తంభించిన యూట్యూబ్..
- October 16, 2018
న్యూయార్క్: ప్రపంచంలోనే ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ సేవలు ఆకస్మత్తుగా బుధవారం(అక్టోబర్ 17) నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ పనిచేయడం ఆగిపోయింది.
దీంతో అనేక మంది నెటిజన్లు యూట్యూబ్, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను ఆ సంస్థ దృష్టికి తెలియజేశారు. దీనికి యూట్యూబ్ స్పందించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్ చేస్తామని యూట్యూబ్ సంస్థ
ఆ తర్వాత మరో ట్వీట్‌లో సమస్య పరిష్కారమైందని, మీ ముందుకు మళ్లీ వచ్చామని.. సహనంతో వేచిచూసినందుకు కృతజ్ఞతలు తెలిపింది. కాగా, అంతకుముందు, యూట్యూబ్ కంటెంట్ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 503 నెట్‌వర్క్ ఎర్రర్ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను షేర్ చేశారు.
అలాగే యూజర్స్‌కు వెబ్‌సైట్ లాగిన్ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 40నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ సర్వీసులు పునర్ ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







