ఎన్‌హెచ్‌ఆర్‌ఎ ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రారంభం

- October 18, 2018 , by Maagulf
ఎన్‌హెచ్‌ఆర్‌ఎ ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రారంభం

బహ్రెయిన్:హెల్త్‌ కేర్‌ సెక్టార్‌కి సంబంధించి కొత్త ఆన్‌లైన్‌ సర్వీస్‌ ప్రారంభమయ్యింది. ఇన్ఫర్మేషన్‌ మరియు ఇ-గవర్నమెంట్‌ అథారిటీ, నేషనల్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎ) కొత్త ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ని, మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ప్రారంభించడం జరిగింది. హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్స్‌కి లైసెన్సింగ్‌ కోసం ముఖ్యంగా ఈ సర్వీసు ఉద్దేశించబడింది. ప్రస్తుతం ట్రయల్‌ వెర్షన్‌ ప్రారంభం కాగా, ఫుల్‌ లాంఛ్‌ తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఐజిఎ రిప్రెజెంటేటివ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో ఈ సర్వీసు ప్రారంభమయ్యే అవకాశం వుంది. డాక్టర్లు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు, లేదా రెన్యువల్‌ కోసం ఈ సర్వీసుని సంప్రదించాల్సి వుంటుంది. గవర్నమెంట్‌ బ్రాంచ్‌ని వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన శ్రమ ఈ సర్వీసు ద్వారా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com