యెమన్, సిరియా సంక్షోభం పై ఒబామా , మొహమ్మద్ బిన్ జాయెద్ టెలిఫోన్ ద్వారా చర్ఛలు

- December 20, 2015 , by Maagulf
యెమన్, సిరియా  సంక్షోభం పై  ఒబామా , మొహమ్మద్ బిన్ జాయెద్  టెలిఫోన్ ద్వారా చర్ఛలు


                         
  ద్వైపాక్షిక సంబంధాల పురోగతి, పరస్పర గౌరవ విషయాలపై అబుదాబీ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం  కమాండర్,  కీరీటీ వారసుడైన యువరాజు  షిక్ మొహమ్మద్ బిన్ జాయెద్, అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామాలు టెలిఫోనులో చర్చించారు. యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్  మరియు యునైటెడ్ స్టేట్స్ అఫ్  అమెరికా మధ్య లోతైన సంబంధాలు దృడపరిచే విదంగా, ఈ రెండు స్నేహ దేశాలు కృషి చేయాలని  కోరారు. ఈ చర్య ద్వారా ప్రజల పరస్పర అభిరుచులు వర్దిల్లుతాయని  అభిలషించారు. సిరియన్ సంక్షోభంను  దృష్టిలో ఉంచుకొని కొనసాగుతున్న ప్రయత్నాలపై ఆరా తీశారు. ఇస్లామిక్ కూటమి ద్వారా,  తీవ్రవాద విపరీత ధోరణులను నిలవరించేందుకు ఒక మార్గం ఏర్పడుతుందన్నారు .  టెలిఫోనులో  సంభాషిస్తూ,యెమన్ లో  తాజా పరిణామాలు , చేయదలిచిన ప్రయత్నాలు, అంతర్జాతీయ చట్టబద్దత తీర్మానాల ఆధారంగా ఒక రాజకీయపరిష్కారం కనుగొననున్నట్లు తెలిపారు. అలాగే, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాలు అమలు విషయం, జెనీవాలో యెమన్ పార్టీల మధ్య  కొనసాగుతున్న చర్ఛలు తదితర అంశాలపై వారు ఇరువురు చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com