'అమరావతి'లో 'డిక్టేటర్' ఆడియో కార్యక్రమం..
- December 20, 2015
సినీ నటుడు బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమాన్ని ఏపీ రాజధాని 'అమరావతి'లో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆడియో కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిమానులు భారీగా అమరావతికి తరలివెళుతున్నారు. చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంతం నుండి రెండు బస్సుల్లో ఆ ప్రాంతానికి వెళుతున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య అభిమానులు 99 కారుల్లో రాజధాని ప్రాంతానికి పయనమవుతున్నారు. వీరితో పాటు నటుడు బాలయ్య కూడా బస్సులో వెళుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా నిర్మాణ రంగంలో అతిపెద్ద నిర్మాణ సంస్థగా పేరున్న ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్. 'లౌక్యం'వంటి బ్లాక్బస్టర్ హిట్ మూవీ అందించిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







