బాణసంచాపై సుప్రీం కోర్టు తీర్పు
- October 22, 2018
బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించలేమని అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయని సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిందని ఏఎన్‌ఐ వార్తసంస్థ తెలిపింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశ వ్యాప్తంగా రాత్రి రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
పర్యావరణం, ప్రజారోగ్యం దృష్ట్యా దేశవ్యాప్తంగా బాణసంచా తయారీ, అమ్మాలను నిలిపివేయాలని సుప్రీం కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారించిన సుప్రీం... బాణసంచాపై దేశవ్యాప్తంగా నిషేధం విధించేందుకు నిరాకరించింది. అయితే,
ఆన్‌లైన్‌లో బాణసంచా అమ్మరాదని, లైసెన్స్ ఉన్న వ్యాపారులనే టపాసులు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించాలని సూచించింది.
సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
దీపావళికి ఏడు రోజుల ముందు తరువాత గాలి నాణ్యత ఎలా ఉందో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించాలి. దిల్లీ రాజధాని పరిధిలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన నివాస సముదాయాల్లోనే బాణసంచా కాల్చాలి. దీపావళి రోజున దేశవ్యాప్తంగా రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి.
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో రాత్రి 11.55 నుంచి 12.30 వరకు ( 35 నిమిషాలు) మాత్రమే టపాసులు కాల్చాలి. ఇతర పండుగలకు, వేడుకలకు కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. తక్కువ పొగ వచ్చే బాణసంచా తయారీకి మాత్రమే అనుమతి ఇవ్వాలి. బాణసంచా వల్ల ఏర్పడే కాలుష్యంపై ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!







