ఐదుగురు భారతీయుల హత్య కేసులో ముగ్గురు సౌదీలకు మరణ శిక్ష
- October 22, 2018
సౌదీ అరేబియా ఈస్టర్న్ ఏరియా క్రిమినల్ కోర్టు, ఓ హత్య కేసులో ఐదుగురు నిందితులకు మరణ శిక్ష విధించింది. నిందితులు ముగ్గురూ సౌదీలే. మృతులు భారతీయులు. ఐదుగురు భారతీయుల్ని, ఫామ్ హౌస్‌లో విందుకు పిలిచిన నిందితులు, డ్రింక్స్‌లో మత్తు పదార్థాల్ని కలిపి, వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళగానే చంపేశారు. వారి దగ్గరనుంచి నిందితులు డబ్బుని, మొబైల్ ఫోన్లనీ దోచుకున్నారు. అనంతరం మృతదేహాల్ని ఓ పెద్ద గోతిలో ఖననం చేసేశారు. హత్య కేసుతోపాటుగా, వీరిపై లిక్కర్ ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు, హాష్ స్మోకింగ్ చేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. నిందితుల్ని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేయడంతో, వారికి మరణ శిక్షను కూడా అమలు చేసేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..