విషాదంగా ముగిసిన భారతీయ జంట సాహస యాత్ర
- October 30, 2018
అమెరికాలో సాహస యాత్ర చేపట్టిన భారతీయ జంట కథ విషాదంగా ముగిసింది. ఆ దేశంలోని యోసెమైట్ నేషనల్ పార్కులో 800 అడుగుల లోయలో పడి ఈ జంట ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాలిఫోర్నియా రాష్ట్రంలోని యోసెమైట్ నేషనల్ పార్కు ఉంది. ఈ పార్కులో సహస యాత్ర కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన విష్ణు విశ్వనాథ్ (29), మీనాక్షి మూర్తి (30)లు వెళ్ళారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. కేరళలోని చెంగన్నూర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు. 2014లో వారి వివాహమైంది. వీరు తొలుత న్యూయార్క్‌లో నివసించారు. ఇటీవలే కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోస్ నగరానికి మారారు.
ఈ జంట ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, తమ సాహస యాత్రల వివరాలను 'హాలిడేస్ అండ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్స్' అనే బ్లాగ్‌లో పోస్ట్ చేస్తుంటారు. యోసెమైట్‌లోనూ పార్కులోని నిటారుగా ఉండే ఎత్తైన కొండను వీరు అధిరోహించారు. అక్కడి నుంచి వీరు జారి కింద పడిపోయి ఉంటారని భావిస్తున్నారు. గత బుధవారం వీరి మృతదేహాలను పర్యాటకులు గుర్తించారు. మేలో తెలుగువాడైన ఆశిష్ పెనుగొండ(29) కూడా ఇదే పార్కులోని ప్రఖ్యాత హాఫ్ డోమ్‌పైకి వెళ్లే క్రమంలో జారిపడి మరణించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







