ఎమిరేట్స్ వాసి వాహన విన్యాసాలు-తప్పిన ముప్పు
- December 21, 2015
తన ఇష్టానుసారంగా విదేశీ ప్రాంతంలో రోడ్లపై విచిత్ర విన్యాసాలు చేస్తున్న ఎమిరేట్స్ వాసికి స్వదేశంలో చుక్క ఎదురైంది. తానూ అమాయకుడినని..ఏ పాపం తెలియదని తొలుత, ఆ వ్యక్తీ బుకాయించినప్పటికి, గతంలో సదరు వ్యక్తీ తాను విదేశీ రోడ్లపై వాహనంతో చేసిన విన్యాసాలకు సంబంధించిన సొంత వీడియో సజీవ సాక్ష్యమైంది. వింత శబ్దాలతో ...చిత్ర విచిత్ర విన్యాసాలతో వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఎదుటవారి వాహనాన్ని దాదాపు ఢీ కొట్టే విధంగా నడుపుతున్న ఓ వీడియోను సామాజిక వెబ్ సైట్లలో పోస్టు సైతం చేశాడు. ఆ భయానక డ్రైవింగ్ కు లైకుల మాటమో గాని....కోర్టుకు అది పెద్ద సాక్ష్యమై కూర్చొంది. ఎమిరేట్స్ నేర పరిశోధన విబాగం ఆ వీడియో ను చూసి, అతను ఏమీ అమాయకుడు కాదని నిర్దారించుకున్నారు.
జి .సి. సి. దేశంలో ప్రమాదకరంగా వాహనాన్ని నడిపిన కారణంగా శిక్షకు పాత్రుడిగా తేల్చారు. ఈ సందర్బంగా అటార్నీ జనరల్ ఆఫ్ అబుదాబీ మొహమ్మద్ అల్ బలూషీ మాట్లాడుతూ, విదీశాలకు వెళ్ళె ఎమిరేట్స్ వాసులు ఆయా దేశ చట్టాలను గౌరవించాలని, అబుదాబీ మంచి పౌరులగా మెలగాలని హితవు పలికారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







