23 మంది ఆసియా వర్కర్లను రక్షించిన దుబాయ్ పోలీసులు
- December 21, 2015
ఓ బస్సులో 12 రోజులపాటు ఆహారం, మంచి నీళ్ళు లేకుండా దీనావస్థలో ఇబ్బందిపడుతున్న 23 మంది ఆసియాకి చెందిన కార్మికులకు విముక్తి కల్పించారు దుబాయ్ పోలీసులు. కస్ర్ అల్ అమీర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ అజ్ఞతంలోకి వెళ్ళిపోవడంతో, ఆ కంపెనీలో పనికోసం కుదిరిన 23 మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఓ బస్సులో రెండు వారాల పాటు మగ్గిపోతున్న వారిని పోలీసులు, శిబిరాలకు తరలించారు. నెలకి 1000 దిర్హామ్‌లు చెల్లించేలా కార్మికులు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా, సెప్టెంబర్ నుంచి వారికి వేతనాలు చెల్లించలేదు కన్‌స్ట్రక్షన్ కంపెనీ. దాంతో, అక్కడి నుంచి బస్సులోకి ఆ కుటుంబాలు షిఫ్ట్ అయ్యాయి. బస్సులో ప్రయాణిస్తూ, పార్కింగ్ స్థలాల్లో బస్‌ని పార్క్ చేసి, అక్కడే బస్సులో ఇరుక్కుపోయి, అత్యంత దారుణ పరిస్థితుల్లో రెండు వారాల పాటు జీవనం గడిపారు బాధితులు. బస్ డ్రైవర్ తమకు సహకరించారని బాధితులు చెప్పారు. బస్ డ్రైవర్ ఏడేళ్ళుగా ఆ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బాధితులకు అవసరమైన న్యాయసహాయం అందించడంతోపాటు, వారికి ఆహారం అందిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం వారికి పాస్‌పోర్ట్‌లు కూడా అందాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







