నవంబర్‌ 19న షార్జాలో ఫైర్‌ వర్క్స్‌, కార్నివాల్‌

- November 14, 2018 , by Maagulf
నవంబర్‌ 19న షార్జాలో ఫైర్‌ వర్క్స్‌, కార్నివాల్‌

షార్జాలో చైల్డ్‌ ఫ్రెండ్లీ సిటీ నినాదంతో నవంబర్‌ 19న ఫైర్‌ వర్క్స్‌, 1 కిలోమీటర్‌ ప్రొసెషన్‌ నిర్వహించనున్నారు. మొట్టమొదటి షార్జా చైల్డ్‌ అండ్‌ యూత్‌ ఫ్రెండ్లీ కార్నివాల్‌ని నవంబర్‌ 19న నిర్వహించేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. ప్రొసెషన్‌ కార్యక్రమంలో మ్జాఇకల్‌ గార్డెన్‌, ఫ్లైయింగ్‌ ఇన్‌ఫ్లాటబుల్‌ క్యారెక్టర్స్‌, జయింట్‌ డబుల్‌ పార్టీ, షోస్‌ అండ్‌ లైవ్‌ మ్యూజిక్‌ ఇతర ప్రధాన ఆకర్షణలు. అల్‌ బుహైరా రోడ్‌పై అల్‌ నూర్‌ మాస్క్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్నివాల్‌ ప్రారంభమవుతుంది. అల్‌ మజాజ్‌ వాటర్‌ ఫ్రంట్‌ వకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు రాత్రి, ఫైర్‌ వర్క్స్‌ డెమోనిస్ట్రేషన్‌ వుంటుంది. షార్జా బేబీ ఫ్రెండ్లీ ఆఫీస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హెస్సా అల్‌ ఘాజల్‌ మాట్లాడుతూ, కమ్యూనిటీని ఒక్కటిగా చేయడానికి ఇదొక మంచి ప్రయత్నమని, పిల్లలు, యూత్‌ సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇదొక మంచి వేదిక అని చెప్పారు. షార్జాకి ఇటీవలే 'చైల్డ్‌ ఫ్రెండ్లీ సిటీ'గా యునైటెడ్‌ నేషన్స్‌ నుంచి అరుదైన గుర్తింపు లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com