బాలుడి మృతి: యూఏఈలో విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- November 14, 2018
సౌదీ అరేబియా నుంచి వెళుతున్న ఓ విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఉమ్రా ప్రార్థనల అనంతరం తిరిగి వెళుతుండగా, నాలుగేళ్ళ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. విమానం టేకాఫ్ అయిన 45 నిమిషాలకే యహ్యా పుతియాపురాయిల్ ఎపిలెప్టిక్ సీజర్స్‌కి లోనయ్యాడు. ఈ ఘటనతో విమానాన్ని అబుదాబీలో అత్యవసరంగా దించారు. జెడ్డాలో విమానం ఎక్కే సమయంలో మైల్డ్ ఫీవర్‌తో బాలుడు బాధపడుతున్నట్లు తెలిపారు మృతుడి అంకుల్. తన తల్లి ఒడిలోనే బాలుడు మృతి చెందినట్లు బాలుడి అంకుల్ మొహమ్మద్ నదీర్ చెప్పారు. నదీర్, అబుదాబీలో నివసిస్తుంటారు. బాలుడి తల్లిదండ్రులు ముహమ్మద్ అలి అల్ జుబైరా కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. యహ్యా అందరికంటే చిన్నవాడు. యహ్యా స్పెషల్ ఛైల్డ్ అనీ, నడవలేడనీ, మాట్లాడలేడనీ నదీర్ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని ఎతిహాద్ ఫ్లైట్‌లో తరలిస్తున్నట్లు ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్‌లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







