వాహనాన్ని ఢీకొట్టి, గాల్లోకి లేచిన కారు
- November 19, 2018
వేగంగా వెళుతున్న కారు, ముందున్న వాహనాన్ని ఢీ కొట్టి, కాస్సేపు గాల్లోకి లేచింది. దీనికి సంబంధించిన ఓ వీడియో, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అబుదాబీ పోలీసులు పోస్ట్ చేసిన వీడియో ఇది. 'యువర్ కామెంట్' హ్యాష్ ట్యాగ్‌తో ఈ వీడియోని అబుదాబీ పోలీసులు పోస్ట్ చేయడం వెనుక, రోడ్లపై ప్రజలు అప్రమత్తంగా వుండాలనే మంచి ఆలోచన వుంది. 'యువర్ కామెంట్' ఇనీషియేటివ్ ద్వారా ఇప్పటికే పోలీస్ పలు వీడియోల్ని పోస్ట్ చేశారు. వీటిని చూసి వాహనాలు నడిపేవారిలో కొంత అప్రమత్తత వస్తోందని అధికారులు అంటున్నారు. పోలీసులు పనిచేసేది ప్రజల కోసమే గనుక, వారు సైతం సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలనీ, రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా, జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







