పాన్‌కార్డ్ కొత్త రూల్..
- November 23, 2018
ఇండియా:ఇంతకు ముందు వార్షిక ఆదాయం రూ.5 లక్షల టర్నోవర్ దాటిన ప్రతి వ్యాపార సంస్థకు పాన్ కార్డ్ తప్పని సరి అనే నిబంధన ఉండేది. తాజా సవరణల ప్రకారం ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చిన సవరణ ప్రకారం ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు తగ్గించారు.
అంటే ఏటా రూ.2.5 లక్షల టర్నోవర్ దాటే ప్రతి వ్యాపారికీ ఇకపై పాన్ కార్డ్‌ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన డిసెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇది వ్యాపారస్తులకు మాత్రమే వర్తిస్తుందని తెలియజేసింది. ఇంతకు ముందు చిరు వ్యాపారులకు పాన్ కార్డ్ తప్పనిసరి కాదు.
కొత్త నిబంధన కిందకి వచ్చే వ్యాపారులంతా 2019 మే 31 కల్లా పాన్ కార్డులను పొందాలని ఆదాయపన్ను శాఖ తెలియజేసింది. ఈ నిబంధనల ప్రకారం బోగస్ కంపెనీల బాగోతం బయటపెట్టే వీలుంటుందని ఐటీ శాఖ భావిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం పాన్ కార్డు పై తండ్రి పేరు తప్పనిసరి కాదు. తల్లి పేరు చెప్పినా ఆమోదించే సదుపాయం కల్పించినట్టు ఐటీ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







